పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీ సమీపంలో ఓ కొండ అకస్మాత్తుగా జారిపోయింది. కొండ అకస్మాత్తుగా జారిపోతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఈ ఘటనపై టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ స్పందించారు. ఇది ప్రకృతి విపత్తు కాదు. జగన్ మేడ్ డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేశారు. పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో వైసీపీ మైనింగ్ మాఫియా అడ్డగోలు తవ్వకాలతో కొండ జారిపోయిందని ట్వీట్ చేశారు.